పరిహారంతో సరిపెట్టేశారు..
మా గ్రామంలో రోడ్డు నిర్మాణం కోసం సేకరించే జిరాయితీ భూములకు నోటిఫికేషన్ ఇచ్చారు. పరిహారం విషయంలో రైతులు వెనక్కి తగ్గకపోవడంతో మూడు పర్యాయాలు కలెక్టర్ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించి ఎట్టకేలకు రూ.60 లక్షల చొప్పున చెల్లించేందుకు అంగీకరించడంతో ఒప్పుకున్నాం. అదే సమయంలో ఆర్ కార్డులు ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. అలాగే చెట్లకు, బోర్లకు, బావులకు పరిహారం చెల్లించలేదు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. దాని గురించి మాట్లాడటం లేదు. భూములు ఇచ్చిన రైతులకు చిన్న చిన్న కాంట్రాక్టు పనులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం లేదు. రాతపూర్వక హామీలు ఇవ్వడంలేదు. కేవలం పరిహారంతోనే సరిపెట్టేశారు. అలాగే రోడ్డు కోసం న్యాయంపూడి, కాగిత, గ్రామాల్లో సేకరించే 20 ఎకరాల డీఫారం ప్రభుత్వ భూములకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఎక్కువ మంది దళితులు ఉన్నారు. నేరుగా రైతులతో మంతనాలు సాగిస్తున్నారు. పరిహారం విషయంలో దళితులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిరాయితీతో సమానంగా వారికి కూడా పరిహారం ఇవ్వాల్సిందే.
–డి.శివ, రైతు, కాగిత
Comments
Please login to add a commentAdd a comment