నాటకీయ పరిణామాలతో ఉద్రిక్తత
సోమవారం రాత్రి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రహదారిపై
ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు
గాదె విజయం 9 గంటలకు ఖరారైంది. ఆర్‌వో కూడా సంతకం చేసి వెళ్లిపోయినా అధికారికంగా ప్రకటించకపోవడం, ధృవీకరణ పత్రం జారీ చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు పీఆర్‌టీయూ ప్రతినిధులు గ్రహించారు. టీడీపీ నాయకులు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్ రాత్రి 9.30 గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉపాధ్యాయుల్లో మరింత అనుమానాలు రేకెత్తాయి. గెలువు విషయంలో ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుందేమోనని గ్రహించారు. వెంటనే అధికారికంగా ప్రకటించి.. ధృవీకరణ పత్రం జారీ చెయ్యాలంటూ పట్టుబట్టారు. కానీ.. కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గాదె మద్దతుదారులు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మెయిన్ ఎంట్రన్స్ రహదారిపై ధర్నాకు దిగారు. వెంటనే ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలంటూ నినదించారు. ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేపడుతున్నారని గ్రహించిన టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి పోలీసులు కౌంటింగ్ కేంద్రంలో ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడు మద్దతుదారులతో ఫోన్‌లో మాట్లాడి.. ఇక్కడ అంతా సవ్యంగానే ఉందని చెప్పడంతో నిరసన ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment