ఢిల్లీ మహిళా సదస్సుకు జెడ్పీటీసీ అనురాధ
కె.కోటపాడు: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే మహిళా సాధికారితపై నిర్వహించే వర్క్‌షాపులో పాల్గొనేందుకు కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధకు ఆహ్వానం అందింది. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాపులో పాల్గొనేందుకు రాష్ట్రంలో ముగ్గురు జెడ్పీటీసీలకు ఆహ్వానం అందగా అందులో తనకు ఆహ్వానం అందడం ఆనందంగా ఉందని ఈర్లె అనురాధ అన్నారు. ఢిల్లీలో 4,5 తేదీల్లో జరిగే వర్క్‌షాపులో పాల్గోనేందుకు సోమవారం ఆమె బయలుదేరి వెళ్లారు. మహిళల నేతృత్వంలో స్థానిక సంస్థల బలోపేతం, పాలనా సామర్థ్యాల పెంపుపై ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమెకు పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment