అనకాపల్లి టౌన్ : వన్ మ్యాన్ సర్వీసులను ఇతర డిపోల వలే ఆల్ట్రా డీలక్స్ సర్వీసు వరకు మాత్రమే పంపాలని ఎన్‌ఎంయూఏ రీజనల్ సెక్రటరీ పి. సుధాకర్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అకారణంగా సస్పెడ్ చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. జోనల్ జాయింట్ కార్యదర్శి జి. శంకర్రావు మాట్లాడుతూ 1–2019 సర్క్యులర్ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బాబు, వేపాడ శ్రీను, ఈఎస్‌ఆర్ మూర్తి వర్మ, కార్మికులు పాల్గొన్నారు.