అనకాపల్లి: పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, పదవీ విరమణ పొంది ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు సన్ క్యాస్టల్ కాన్ఫరెన్స్ హాల్‌ల్లో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 34 సంవత్సరాల పాటు అప్పారావు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఎస్పీ రవివర్మ, అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, ఈ.శ్రీనివాసు, ఏవో ఏ.రామకుమార్, సీఐలు టి.వి.విజయకుమార్. ఎం.వెంకటరమణ, లక్ష్మణమూర్తి, బాలసూర్యారావు, లక్ష్మి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.