
ఉద్యోగ మేళా క్యాలెండర్ ఆవిష్కరణ
తుమ్మపాల: జిల్లాలో గల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకు రెండు ఉద్యోగ మేళాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 2025–26 సంవత్సరానికి రూపొందించిన ఉద్యోగ మేళా వార్షిక క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశంలో ఈమేరకు సీఎం ఆదేశించారని చెప్పారు. క్యాలెండర్‌ను అనుసరించి ఉద్యోగ మేళాలు నిర్వహించాలన్నారు.
14న అంబేడ్కర్ జయంత్యుత్సవం
ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా చేపడుతున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ చెప్పారు. అనకాపల్లి పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో గల అంబేడ్కర్ విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని, అనంతరం స్థానిక ఎస్‌ఆర్ శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్‌లో జయంత్యుత్సవ సభ నిర్వహిస్తామన్నారు.