
మద్యం బాధితులకు ఉచిత చికిత్స
తుమ్మపాల: ఆల్కహాల్ వ్యసనం నుంచి విముక్తి కోసం 30 రోజుల డి–అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా అసిస్టెంట్ ప్రోహిబిషన్, ఎకై ్సజ్ అధికారి టి.రాజశేఖర్ తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ’కమిటీ ఆన్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని మండలంలో కొత్తూరు గ్రామంలో విజయ విశాఖ క్యాటిల్ ఫీడ్ కంపెనీలో కార్మికులతో శనివారం నిర్వహించారు. ఎవరైనా డి –అడిక్షన్ కేంద్రంలో చేరితే ఉచిత భోజనం, వసతి సౌకర్యంతో 30 రోజుల పాటు ఉచితంగా చికిత్స అందిస్తున్నామన్నారు. కేర్ కమిటీ సభ్యులు సీడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి సన్యాసిరావు పాల్గొన్నారు. అంతకుముందు పిసినికాడలో డి–అడిక్షన్ కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని డి– అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించి చికిత్స పొందుతున్నవారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఐ లక్ష్మునాయుడు, కంపెనీ ప్రతినిధి ప్రసాద్, కార్మికులు పాల్గొన్నారు.