
రాజశేఖరరెడ్డి సతీమణి శైలజారెడ్డిని పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
వజ్రకరూరు: జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ టి.రాజశేఖరరెడ్డి మృతదేహానికి మంగళవారం పలువురు ఘనంగా నివాళులర్పించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. వజ్రకరూరు మండలం కమలపాడులోని ఆయన స్వగృహంవద్ద ప్రజల సందర్శనార్థం రాజశేఖరరెడ్డి మృతదేహాన్ని ఉంచారు. నివాళులర్పించిన వారిలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, ఆయన కుమారుడు, అగ్రి అడ్వైజరీ బోర్డు ఏపీ చైర్మన్ అంబటి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రసాదరెడ్డి, జిల్లా నాయకులు మధుసూదన్‌రెడ్డి, పామిడి వీరా, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, ఉరవకొండ మార్కెట్ యార్డు చైర్‌పర్రసన్ సుశీలమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటరెడ్డి, హనుమంతరెడ్డి, మండల కన్వీనర్ సోమశేఖర్‌రెడ్డి, వజ్రకరూరు జెడ్పీటీసీ వసికేరి తేజేశ్వరి, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌ఖాన్, ఉద్యాన శాఖ డీడీ రఘునాథరెడ్డి, తదితరులున్నారు. రాజశేఖర్‌రెడ్డి సతీమణి శైలజారెడ్డి, కుమారులు సందీప్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం రాజశేఖరరెడ్డి అంత్యక్రియల్లో తన కుటుంబసభ్యులతో కలసి విశ్వ పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న విశ్వ (చిత్రంలో) అగ్రి బోర్డు ఏపీ చైర్మన్ అంబటి కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment