●వైవీఆర్‌కు ఘన స్వాగతం
వైఎస్సార్‌సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డికి ఘన స్వాగతం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొంది కోలుకున్న తర్వాత శుక్రవారం గుత్తి మీదుగా గుంతకల్లులోని ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేత వస్తున్న విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. బాణసంచా పేలుస్తూ.. డప్పులు వాయిద్యాల నడుమ డ్యాన్సులు చేస్తూ పూల వర్షంతో స్వాగతించారు. తనను చూసేందుకు తరలివచ్చిన గుంతకల్లు, గుత్తి, పామిడి ప్రాంత కార్యకర్తలు, నాయకులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. – గుంతకల్లు:
Comments
Please login to add a commentAdd a comment