విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి
గార్లదిన్నె: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం గార్లదిన్నె మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రితో పాటు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, కలెక్టర్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థుల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమం తీసుకువచ్చారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో భాగంగా ఒకే రోజు 90 వేల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటనారాయణ, వైస్ ఎంపీపీ కుంచం రామ్మోహన్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి, ఆర్డీఓ కేశవనాయుడు, డీఈఓ ప్రసాద్, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, తహసీల్దార్ ఈరమ్మ పాల్గొన్నారు.
యూనిక్ ఐడీ తప్పనిసరి
బుక్కరాయసముద్రం: ప్రతి రైతూ యూనిక్ ఐడీ తప్పనిసరిగా కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ పేర్కొన్నారు. శుక్రవారం బి.కొత్తపల్లిలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి రైతూ యూనిక్ నంబర్ (విశిష్ట గుర్తింపు సంఖ్య) కలిగి ఉండాలన్నారు. యూనిక్ ఐడీతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్యామ్ సుందర్‌రెడ్డి, పట్టు పరిశ్రమ సహాయకుడు రమాకాంత్, చౌడేశ్వరి రైతులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment