వేతనాలు విడుదల చేయాలి
కార్మికులకు చెల్లించాల్సిన బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలి. దీనికి తోడు 30 నెలల పీఎఫ్ చెల్లించాలి. కనీస వేతనం అమలు చేయాలి. నీటి మీటర్లు బిగించరాదు. వేతనాలు అడిగితే కాంట్రాక్టర్లు, అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ప్రజలకు తాగునీరు ఉచితంగా అందించాలి. లేని పక్షంలో నిరంతర ఉద్యమం చేస్తాం.
– వన్నూరుస్వామి, జిల్లా కోశాధికారి,
శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం వర్కర్స్ అండ్
ఎంప్లాయీస్ యూనియన్
సమస్య తీవ్రం కాకనే పరిష్కరించండి
వేసవి రాకముందే తాగునీటి సమస్య వచ్చింది. ఏ ఊర్లో చూసినా నీటి కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు వేతనాల కోసం సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ సమయంలోనే గంగవరం పంప్ హౌస్ వద్ద విద్యుత్ మోటర్లు కాలిపోయాయి. మరమ్మతులు చేసేందుకు ఎవరో పూణే నుంచి రావాలంటున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విడ్డూరం. వెంటనే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.
– గోళ్ల సూర్య నారాయణ, వైఎస్సార్‌సీపీ
మండల కన్వీనర్, కళ్యాణదుర్గం
వేతనాలు విడుదల చేయాలి
Comments
Please login to add a commentAdd a comment