రైతుకు భరోసా అందించాలి
అనంతపురం సిటీ: కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఆకాశ వాణి అనంతపురం కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ క్యాంపస్‌లోని డీపీఆర్‌సీ భవన్‌లో శనివారం నిర్వహించిన రేడియో రైతు దినోత్సవానికి జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కలెక్టర్ వినోద్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. దేశానికి వెన్నెముక లాంటి రైతులకు వెన్నుదన్ను లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ, నెట్, మొబైల్ లేని రోజుల్లో రైతన్నలకు దిక్సూచిగా నిలిచింది రేడియో ఒక్కటేనన్నారు. కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టాదారు పాసుపుస్తకం, మ్యుటేషన్లు, కబ్జాలు తదితర సమస్యలపై రైతులు గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. తాను కూడా ప్రతి రోజూ ఒక్కో మండలానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే, కలెక్టర్‌లు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిలో డీపీఆర్‌సీ భవన్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో డీఏఓ ఉమామహేశ్వరమ్మ, రైతులు, అధికారులు పాల్గొన్నారు.
రేపు ‘దుర్గం’లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్/రాయదుర్గం: ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’ జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఈనెల 17వ తేదీ (సోమవారం) రాయదుర్గం పట్టణంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాయదుర్గం డ్వామా ఏపీడీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తనతో పాటు జేసీ, డీఆర్‌ఓ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటా రన్నారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్‌లో కార్యక్రమం నిర్వహించడం లేదని, ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
Comments
Please login to add a commentAdd a comment