‘వ్యవసాయం దండగ’ నినాదమే అమలు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నినాదాన్నే పరిటాల సునీత అమలు చేస్తున్నారు. హంద్రీ–నీవా కాలువ పనులు రద్దు చేసే విషయంలో మొండి వైఖరి అవలంబిస్తున్నారు. లైనింగ్ పనులు పూర్తి చేస్తే కాలువకు దిగువనున్న 20 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు అడుగంటి పచ్చని పొలాలు బీళ్లుగా మారతాయి. రైతులు వలసలు పోతారు. మళ్లీ ఫ్యాక్షన్ మొదలయ్యే ప్రమాదముంది. నియోజకవర్గంలోని రైతులను వలస బాట పట్టించాలని ఉంటే పనులు చేయండి. ఈ ప్రాంతం ఎడారిగా కావాలంటే పనులు చేపట్టండి. లైనింగ్ పనులను రైతులతో కలిసి అడ్డుకుంటాం. ఇది హెచ్చరిక కాదు చివరి అల్టిమేటం’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాతను కష్టపెట్టే విధానాలను మానుకోవాలని కోరారు. మొండివైఖరితో పనులు చేయాలని చూస్తే ఎక్కడికక్కడ అడ్డుకుని తీరతామన్నారు. పైసా ఖర్చు చేసే పని లేకున్నా పేరూరు డ్యాంకు పరిటాల సునీత నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. తాజాగా నియోజకవర్గాన్ని శాశ్వతంగా ఎడారిగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇది ఆమెకు తగదన్నారు. త్వరలో ఆత్మకూరు మండలం సింగంపల్లి నుంచి వేలాదిమందితో పాదయాత్ర మొదలుపెట్టి ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల వరకు కొనసాగిస్తామన్నారు. పాదయాత్రలో పరిటాల సునీత అక్రమాలు, అవినీతిని ప్రజల్లో ఎండగడతామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గోడు పట్టించుకునే నాథుడు లేడన్నారు. గతంలో 40 టీఎంసీల సామర్థ్యం ఉన్న హంద్రీ–నీవా కాలువను 5 టీఎంసీలకు కుదించిన చంద్రబాబు... నేడు 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే హంద్రీ–నీవా కాలువను కేవలం 300 చెరువులకు నీళ్లిచ్చే కాలువగా మారుస్తున్నారన్నారు. పాదయాత్రకు పోలీసు అధికారులు అనుమతులు ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ అనంతపురం రూరల్ మండలం–1,2 కన్వీనర్లు బండి పవన్, దుగుమర్రి గోవిందరెడ్డి, యూత్ విభాగం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి, నాయకులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
హంద్రీ–నీవా లైనింగ్‌తో
విధ్వంసాలు చూస్తారు
కమీషన్ల ఆశలో రైతులకు
పరిటాల సునీత అన్యాయం
త్వరలో వేలాదిమంది
అన్నదాతలతో పాదయాత్ర
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment