కదులుతున్న బస్సు.. కిటికీలో కాళ్లు
● మద్యం మత్తులో వ్యక్తి నిర్లక్ష్యం
● సోషల్ మీడియాలో వైరల్
● ప్రభుత్వంపై నెటిజన్ల సైటెర్లు
గుత్తి రూరల్: పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ వ్యక్తి.. బస్సు కదిలాక కిటికీలో నుంచి కాళ్లు బయటకు పెట్టి దర్జాగా నిద్రపోయాడు. ఆదివారం సాయంత్రం గుత్తి నుంచి అనంతపురం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఖరి సీటులో కూర్చున్న మందుబాబు బస్సు కిటికీలో నుంచి తన రెండు కాళ్లు బయటకు పెట్టి ప్రయాణించాడు. ఈ విషయాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలైంది. దీనిపై పలువురు నెటిజన్లు సైటెర్లు పేల్చారు. ‘మీకు పూర్తిగా కిక్ ఇస్తా, కంపెనీలతో మాట్లాడి నాణ్యమైన మద్యం అందిస్తా’ అంటూ గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఓ వ్యక్తి గుర్తు చేశారు. ‘కూటమి ప్రభుత్వానికి విద్య, వైద్యం మీద శ్రద్ధ లేదనడానికి ఉదాహరణ ఇది’ అంటూ ఒకరు.. ‘ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక విచ్చలవిడిగా బెల్ట్ షాపుల రూపంలో మద్యం దొరుకుతోంది. ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఊరూరా బెల్టు దుకాణాల్లో మద్యం మాత్రం దొరుకుతోంది. చంద్రబాబు చెబుతున్న మంచి ప్రభుత్వం అంటే ఇదే’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment