చిన్న తప్పు దొర్లినా మీదే బాధ్యత
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఏ చిన్న తప్పు దొర్లినా చీఫ్ సూపరింటెండెంట్లు(సీఓ), డిపార్ట్‌మెంటల్ అధికారులే(డీఓ) బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎం. ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు. ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి సోమవారం డీఓ, సీఎస్‌లతో స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందు నాయక్, అనంతపురం డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు మాట్లాడారు. పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటాయన్నారు. మొత్తం 135 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 98 ‘ఏ’ సెంటర్లు, 37 ‘బీ’ సెంటర్లు ఉన్నాయన్నారు. 32,803 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. నిర్దేశిత సమయంలో మాత్రమే ప్రశ్నపత్రాలు ఓపెన్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా చూడాలన్నారు. పరీక్ష సమయంలో బయట వ్యక్తులెవరినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దన్నారు. ప్రతి కేంద్రంలో గాలి, వెలుతురు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలన్నారు. అంధులు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు స్క్రైబ్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అంధ విద్యార్థులకు జంబ్లింగ్ విధానం పాటించాల్సిన అవసరం లేదన్నారు. ఎస్కార్ట్ సాయంతో ప్రశ్నపత్రాలు స్టోరేజీ పాయింట్ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలించాలన్నారు. ప్రశ్నపత్రాలను ఇన్విజిలేటర్‌కు అందించే ముందు ఆరోజు జరిగే పరీక్షకు చెందినదా, అదేకోడ్‌కు చెందిన వాటిని అందిస్తున్నామా.. లేదా పరిశీలించుకోవాలన్నారు. పరీక్షల విధుల్లో ఉండే ఉద్యోగులందరూ సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య ఉత్పన్నంగా కాకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.
సీఓలు, డీఓలకు
డీఈఓ ప్రసాద్ బాబు హెచ్చరిక
పదో తరగతి పరీక్షల
నిర్వహణపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment