
అశాసీ్త్రయ సంస్కరణలపై ఉద్యమిద్దాం
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల విద్యలో జీఓ 117 రద్దుకు సంబంధించిన అశాసీ్త్రయమైన సంస్కరణలపై ఉద్యమించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె.కులశేఖరరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ మాట్లాడారు. ఉపాధ్యాయ సీనియార్టీ జాబితాలో ఉన్న తప్పిదాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అప్ గ్రేడ్ కానీ ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. జిల్లా నాయకత్వం పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలోనూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఫెడరేషన్ సబ్ కమిటీ సభ్యులు వజీర్ బాషా, అశోక్ నాయక్, కమిటీ సభ్యులు నరసింహులు, రమేష్ రెడ్డి, సూరి, నాగిరెడ్డి నారాయణ నాయక్, హుస్సేన్ ఖాన్, ఆదినారాయణ, ఫక్రుద్దీన్, హుస్సేన్ పీరా, వెంకటేశ్వర రెడ్డి, రహంతుల్లా, నారాయణరెడ్డి, గురప్ప పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను
కాపాడుకుందాం
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
(1938) నాయకుల పిలుపు