
మళ్లీ బుక్ చేసుకునే అవకాశం కోల్పోయాం
నా కుమార్తె జోషికకు పుట్టుకతోనే కుడి కన్ను లేదు. చిన్నారికి ఎలాంటి పరీక్షలు చేయకుండానే కన్ను లేదని నిర్ధారించవచ్చు. ఆమె చదువులకు, ఉద్యోగ అవకాశాలకు పనికి వస్తుందని సదరం స్లాట్ బుక్ చేసుకుంటే ఇప్పుడు పరీక్షలకు అవకాశం వచ్చింది. దీంతో ముదిగుబ్బ నుంచి తెల్లవారుజామునే బయలుదేరి వచ్చాను. ఇక్కడకు వచ్చిన తర్వాత కంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరం కూడా లేదని అంటున్నారు. పోతే పోయిందేలే అనుకుని మళ్లీ స్లాట్ బుక్ చేద్దామనుకుంటే రూల్స్ ఒప్పుకోవంటా. ఎందుకు పరీక్షలు చేయించుకోలేదో వైద్యులు రాతపూర్వకంగా ఇచ్చిన వివరణను జతపరచాలంటా. అంతేకాక మరో మూడు నెలల వరకూ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లేదు. – రమాదేవి, ముదిగుబ్బ, శ్రీసత్యసాయి జిల్లా