
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్) బుధవారం ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలు, స్పాట్ విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా మూల్యాంకనం ముగిసిన సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లా విద్యశాఖాధికారి డీఈఓ ప్రసాద్ బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్‌ను సన్మానించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కరణం హరి కృష్ణ, బాల సుబ్రహ్మణ్యం, మహబూబ్ ఖాన్, ఖలందర్, ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్లపర్తి శివానందరెడ్డి, ఆదిశేషయ్య, తిమ్మప్ప, గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డేగావత్ రవీంద్రనాథ్, హెచ్‌ఎం పురుషోత్తం బాబు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హిందీ టీచరుకు సన్మానం
ఏటా మాదిరిగానే రిటైర్డ్ అయిన హిందీ టీచర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిటైర్డ్ టీచరు అల్లు సుబ్బ కృష్ణమనాయుడుని డీవైఈఓ శ్రీనివాసరావు, ఏసీ గోవిందనాయక్ చేతులమీదుగా ఏసీఓ, హెచ్‌ఎంలు పి.ఫయాజుద్దీన్,అజ్మతుల్లా, చంద్రమౌళి ఆధ్వర్యంలో సన్మానించారు. సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు