
నెట్టికంటుడికి కిలో వెండి వితరణ
గుంతకల్లు రూరల్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మౌనిక, రాకేష్ దంపతులు ఆదివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి కిలో బరువున్న వెండిని అందజేశారు. అంతకు ముందు దాతల కుటుంబసభ్యుల పేరున ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
లైంగిక వేధింపులపై
కేసు నమోదు
గార్లదిన్నె: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను లైంగికంగా వేధిస్తున్న పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు భాస్కర్‌పై కేసు నమోదు చేసినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్‌ఐ గౌస్ మహమ్మద్‌బాషా తెలిపారు. భాస్కర్ యర్రగుంట్ల గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలసి బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బ్రెయిన్ స్ట్రోక్‌తో
ఉపాధ్యాయుడి మృతి
గుత్తి రూరల్: మండలంలోని బాచుపల్లి జంగాల కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎన్.కాంతారావు (58) ఆదివారం కన్నుమూశారు. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండే వారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం కుటుంబసభ్యులు చేర్పించారు. పరిస్ధితి విషమించడంతో ఆదివారం ఉదయం 6.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన మృతి చెందారు. ఆయన మృతిపై వైఎస్సార్‌టీఏ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓబులేసు, వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

నెట్టికంటుడికి కిలో వెండి వితరణ