స్వల్పంగా పెరిగిన స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ | - | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌

Published Wed, Apr 16 2025 12:18 AM | Last Updated on Wed, Apr 16 2025 12:18 AM

స్వల్పంగా పెరిగిన స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌

స్వల్పంగా పెరిగిన స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌

అనంతపురం అగ్రికల్చర్‌: ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆస్తి, పంట, పశువులు, జీవాలు, కోళ్ల నష్టానికి వర్తింపజేసే ఎక్స్‌గ్రేషియా (స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌) స్వల్పంగా పెంచుతూ రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ ఖరారు చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. పెరిగిన స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ 2024 ఆగస్టు నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు.

● పాడి ఆవు లేదా గేదె చనిపోతే రూ.50 వేలు, ఎద్దుకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, గొర్రెలు, మేకలకు రూ.7,500, కోడికి రూ.100 ప్రకారం గరిష్టంగా రూ.10 వేలు, పశువుల పాక నష్టానికి రూ.5 వేల ప్రకారం వర్తింపజేశారు.

● మనిషి చనిపోతే రూ.5 లక్షలు, ఇళ్లు కూలినా, దెబ్బతిన్నా రూ. 10 వేలు, కిరాణా కొట్టుకు రూ.25 వేలు, రూ.40 లక్షల వార్షిక టర్నోవర్‌ కలిగిన కుటీర పరిశ్రమలకు రూ.50 వేలు, రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్‌ కలిగిన వాటికి రూ.లక్ష, రూ.ఒకటిన్నర కోటికి పైగా టర్నోవర్‌ కలిగిన వాటికి రూ.1.50 లక్షలు, ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు, త్రిచక్ర వాహనాలకు రూ.10 వేలు, తోపుడు బండ్లకు రూ.20 వేలు, చేనేతలకు రూ.25 వేలు, పాక్షికంగా బోట్లు దెబ్బతింటే రూ.9 వేలు, వలలకు రూ.5 వేలు, బోట్లు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు, మోటార్‌ బోట్లు, వలలు దెబ్బతింటే రూ.25 వేలు, చేపల చెరువుకు రూ.18 వేలు, పట్టు రైతులకు 25 వేల ప్రకారం నష్ట ఉపశమనం వర్తింపజేస్తారు.

● వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం లెక్కకట్టి ఇస్తారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్‌ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ ఖరారు చేశారు.

● అరటి,మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్‌ ఫ్రూట్‌, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరపహెక్టారుకు రూ.35 వేలు,కళింగర,కర్భూజా, దోస, బొప్పాయి, టమాట, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్రపెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం ఖరారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement