
ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
తాడిపత్రి టౌన్: క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఏడుగురిని గురువారం తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రోహిత్‌కుమార్ వివరాలు వెల్లడించారు. పట్టణ శివారులోని రజక కల్యాణ మంటపం వద్ద ‘ఏస్ టీకింగ్’ క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏజెంట్ మకందర్ సంధానీ తచ్చాడుతుండగా... అనుమానంతో ఎస్‌ఐ గౌస్‌బాషా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈజీ మనీ కోసం సెల్‌ఫోన్లలో మట్కా, యాప్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారణ కావడంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు అతని స్నేహితులు బలపనూర్ షబ్బీర్, మకందర్ జిలానీ, మకందర్ మహబూబ్‌బాషా, డోంగ్రీ హరూన్, పోస నరేష్ బాబు, షేక్ ముజీబ్, పామిడి మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.20 లక్షలు నగదుతో పాటు 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అందరూ జేసీ అనుచరులే
అరెస్ట్‌యిన వారిలో మకందర్ సంధానీ క్రికెట్ బుకీ కాగా, డోంగ్రీ హరూన్ తాడిపత్రిలో హరూన్ మోటార్స్ పేరుతో ఎలక్ట్రికల్ బైక్‌లు విక్రయిస్తున్నాడు. అతనికి పార్టనర్‌గా మకందర్ జిలానీ ఉన్నారు. హరూన్ మోటార్స్‌లో డ్రైవర్‌గా షేక్ ముజీబ్ పనిచేస్తున్నాడు. హరూన్‌కు బలపనూర్ షబ్బీర్ స్నేహితుడు. పామిడి మహమ్మద్ మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతనికి పోస నరేష్‌బాబు స్నేహితుడు. వీరంతా స్థానిక మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులే కావడం గమనార్హం.
4.20 లక్షలు నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం