
జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ
అనంతపురం: ఉమ్మడి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి భీమారావును ఎస్పీ పి.జగదీష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులోని చాంబర్‌లో జడ్జికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్
బొమ్మనహాళ్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న యువకులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు. ఉద్దేహాళ్‌లో మంగళవారం బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువకులు చికెన్ కబాబ్ సెంటర్ వన్నూరుస్వామి, చిన్నా, ఇమ్రాన్, మహేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంటిపై పెట్రోల్‌తో దాడి
తాడిపత్రి టౌన్: స్థానిక శ్రీనివాసపురంలో నివాసముంటున్న బేల్దారి మల్లికార్జున ఇంటిపై మంగళవారం అదే కాలనీకి చెందిన చాకలి రాముడు బంధువు భరత్, మరో వ్యక్తి పెట్రోల్‌తో దాడి చేసారు. రెండు నెలల క్రితం స్థానిక జేసీ పార్కు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో చాకలి రాముడు మృతి చెందిన విషయం తెలిసిందే. తన బంధువు మరణానికి కారణం మల్లికార్జుననే కక్షతో భరత్ ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. దీంతో ఇంట్లో విలువైన సామగ్రి కాలిపోయింది. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
బీపీఈడీ నాలుగో సెమిస్టర్
ఫలితాలు విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య బి.అనిత మంగళవారం విడుదల చేశారు. మొత్తం 33 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 29 మంది ఉత్తీర్ణులయ్యారు.