
సాక్షి, అమరావతి: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్, శాశ్వత ప్రాతిపదికన స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీ కోసం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు 143 మంది వైద్యులు హాజరయ్యారు. శుక్రవారం రాత్రికి మెరిట్ జాబితాలను సిద్ధం చేసి కౌన్సెలింగ్ నిర్వహించారు.
శాశ్వత ప్రాతిపదికన ఏడుగురు గైనిక్, నలుగురు ఈఎన్‌టీ, ఆరుగురు పెథాలజీ, 13మంది అనస్తీషియా స్పెషాలిటీ వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కాంట్రాక్టు ప్రాతిపదికన నలుగురు ఈఎన్‌టీ, ఒక పెథాలజీ వైద్యులకు పోస్టింగ్ ఇచ్చారు. శనివారం జూమ్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి మిగిలిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment