Walk-in interviews
-
స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి వాక్–ఇన్ ఇంటర్వ్యూ లు
సాక్షి, అమరావతి: డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆస్పత్రులతోపాటు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) పరిధిలో 13 స్పెషాలిటీల్లో 343 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ భర్తీ చేస్తోంది. ఇందుకోసం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సోమవారం నుంచి 15వ తేదీ వరకు వాక్–ఇన్ ఇంటర్వ్యూ లను నిర్వహించనుంది. ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో రోజు మార్చి రోజు ఈ నెల 15వ తేదీ వరకు ఇంటర్వ్యూ లు ఉంటాయి. రెగ్యులర్(లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యులను నియమించనున్నారు. సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో గిరిజన ప్రాంతాలను ఎంపిక చేసుకున్న వైద్యులకు నెలకు రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.రెండు లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఖరారు చేశారు. ఎన్హెచ్ఎం కింద బోధన, జిల్లా ఆస్పత్రుల్లో నియమించే వారికి రూ.1.10 లక్షలు చొప్పున ఇస్తారు. ఇక ఎన్హెచ్ఎంలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో నియమించేవారికి మైదాన ప్రాంతాల్లో రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయి. అభ్యర్థులు అదనపు వివరాల కోసం http://hmfw.ap.gov.in/ వెబ్‌సైట్‌ను, 6301138782 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండకుండా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గడిచిన నాలుగేళ్లలో 53వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. ఇంటర్వ్యూ ల నిర్వహణ షెడ్యూల్ ఇలా.. సోమవారం(11వ తేదీ): జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ బుధవారం(13వ తేదీ): గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పెథాలజీ శుక్రవారం(15వ తేదీ): పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ -
331 వైద్య పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలోని ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ) పరిధిలో 14 స్పెషాలిటీల్లో 331 వైద్య పోస్టుల భర్తీకి వచ్చే నెల ఐదోతేదీ నుంచి వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్ బుధవారం తెలిపారు. శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేసి రిటైరైన వారికి కాంట్రాక్ట్ పద్ధతి నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి 70 ఏళ్లు పైబడని రిటైర్డ్ వైద్యులు అర్హులని తెలిపారు. 5వ తేదీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటీల్లో, 7వ తేదీ గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 10వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి స్పెషాలిటీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని వివరించారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు గొల్లపూడిలోని ఏపీవీవీపీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు చేరుకుని దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు hmfw.ap.gov.in లో చూడాలని సూచించారు. ఇతర వివరాలకు 06301138782 ఫోన్ నంబరులోగానీ,apvvpwalkinrecruitment@gmail.com లోగానీ సంప్రదించాలని కోరారు. కాంట్రాక్ట్ పద్ధతి నియామకాల్లో గిరిజన ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చూడాలనే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 48 వేలకుపైగా పోస్టులను భర్తీచేసిన విషయం తెలిసిందే. ఏపీవీవీపీ పరిధిలోని గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడానికి ఇప్పటికే పలుమార్లు వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరోసారి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. -
వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు.. 143 మంది వైద్యుల హాజరు
సాక్షి, అమరావతి: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్, శాశ్వత ప్రాతిపదికన స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీ కోసం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు 143 మంది వైద్యులు హాజరయ్యారు. శుక్రవారం రాత్రికి మెరిట్ జాబితాలను సిద్ధం చేసి కౌన్సెలింగ్ నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన ఏడుగురు గైనిక్, నలుగురు ఈఎన్టీ, ఆరుగురు పెథాలజీ, 13మంది అనస్తీషియా స్పెషాలిటీ వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కాంట్రాక్టు ప్రాతిపదికన నలుగురు ఈఎన్టీ, ఒక పెథాలజీ వైద్యులకు పోస్టింగ్ ఇచ్చారు. శనివారం జూమ్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి మిగిలిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. -
ప్రవేశాలు: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), హైదరాబాద్ కింది కోర్సులో ప్రవేశానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (పీజీడీహెచ్ఎం) అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. మ్యాట్/సీమ్యాట్/క్యాట్/జీమ్యాట్/గ్జాట్/ఏటీఎంఏ పరీక్షలో అర్హత స్కోరు కలిగి ఉండాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: మే 11 వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. చిరునామా: ఏఎస్సీఐ, రోడ్ నెం 3, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 వెబ్సైట్: www.asci.crg.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు.