సాక్షి, అమరావతి : ఏపీలో 24 గంటల్లో 74,465 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,477 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కొత్తగా 2,701 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,05,026 గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,744కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 21,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 83,42,265 మందికి సాంపిల్స్ పరీక్షించడం జరిగింది.(చదవండి : ఢిల్లీ వాసులను వణికిస్తున్న కరోనా ‘థర్డ్ వేవ్’)
Comments
Please login to add a commentAdd a comment