
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 47,130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 545 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 86,2758కి చేరింది. గత 24 గంటల్లో 1,390 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,42,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కరోనా విజృంభణ: సుప్రీం కీలక ఆదేశాలు)
గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరిలో ఒక్కరి చొప్పున మొత్తం 10 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 6948కి చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 13,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 96,62,220 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (చదవండి: భారత్ బయోటెక్ మరో గుడ్‌న్యూస్)
Comments
Please login to add a commentAdd a comment