
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,044 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 854764కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో ఇద్దరు.. కృష్ణాలో ఇద్దరు.. విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి ఒక్కరు చొప్పున మొత్తం 13 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 6881కు చేరింది. (చదవండి: సంచలన వ్యాఖ్యలు చేసిన సత్యేంద్ర జైన్)
గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 1507 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 829991 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17892 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 91,97,307 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.(చదవండి: వ్యాక్సిన్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment