సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.4,23,10,183 జమ చేసింది. వ్యవసాయ సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్షంగా బదిలీ చేసి, అక్కడి నుంచి విద్యుత్ పంపిణీ సంస్థకు పంపనున్నారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ నెల వ్యవసాయ విద్యుత్ బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి శుక్రవారం జీవో జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment