సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో తన విధులను యథాతథంగా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన నాడు-నేడు కార్యక్రమంపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన గడువు లోపు నాడు-నేడు పనులు పూర్తి చేసేందుకు అధికారులతో చర్చించారు. ఫ్యానులు, బ్లాక్ బోర్డులు, బెంచీలు తదితర వస్తువులు ఇప్పటివరకు లక్ష్యం మేరకు సరఫరా కాకపోవడాన్ని మంత్రి ప్రశ్నించారు. సప్లయర్స్‌తో మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నాటికి 70-80 శాతం సామాగ్రిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు నిర్దేశించిన స్థాయిలో సామాగ్రిని సరఫరా చేయని కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని అధికారులకు తెలిపారు. (చదవండి: కరోనాతో ఎంపీ నిధులకు బ్రేక్ )
అవసరమైతే కంపెనీలను తప్పించండి
ఆయా కంపెనీ స్థాయి పరిశీలించేందుకు అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆయా కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యం ఎంత? సరఫరా ఏమేరకు జరిగింది అన్న అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. అవసరమైతే సరఫరా చేయలేని కంపెనీలను తప్పించి ఎల్ 2, ఎల్ 3 వ్యక్తులకు అప్పగించేందుకు పరిశీలించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తిరిగి సమీక్ష జరిపే నాటికి 80 శాతం సామాగ్రి తప్పనిసరిగా సరఫరా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై సెప్టెంబర్ 1న తిరిగి సమీక్ష నిర్వహిస్తానని మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులకు తెలిపారు. (చదవండి:వైఎస్సార్‌సీపీ నాయకుడి దారుణ హత్య)
Comments
Please login to add a commentAdd a comment