సాక్షి, తాడేపల్లి: బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేడ్కర్ అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. ‘‘సర్వసమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేద్కర్. అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళి అర్పిస్తున్నానని’’ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు.
విశాఖపట్నం: నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో చారిత్రాత్మక అభివృద్ధికి పునాదులు వేసిన మహోన్నతుడు అంబేడ్కర్ అని కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగాలంటే అంబేద్కర్ ఆశయాల ఆచరణ ముఖ్యమని ఆయన పిలుపునిచ్చారు.
గుంటూరు: అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హోంమంత్రి మేకతోటి సుచరిత నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుందన్నారు.
నెల్లూరు: జిల్లాలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు.
అనంతపురం జిల్లా: అంబేడ్కర్ 130 వ జయంతి సందర్బంగా ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ ఛైర్మన్ లింగం నిర్మల, వైస్ ఛైర్మన్ చందమూరి నారాయణరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. హిందూపురం అంబేడ్కర్ సర్కిల్లో 25 అడుగుల అంబేడ్కర్ కటౌట్ ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
విజయవాడ: బిఆర్ అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్.. ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతి లాల్ దండే.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు శామ్యూల్ ఆనంద్.. జాయింట్ కలెక్టర్లు మాధవిలత, మోహన్, సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ ఫోటో ఎగ్జిబిషన్‌ను అధికారులు పరిశీలించారు.
చదవండి:
చంద్రబాబు నుంచి ప్రాణ హాని..
ఇది గోదారోళ్ల డ్రింకండీ.. దీని టేస్ట్ సూపరండీ బాబూ..
Comments
Please login to add a commentAdd a comment