ఒహియో సెనేటర్ జేడీ వేన్స్ పేరును ప్రకటించిన ట్రంప్
వేన్స్ సతీమణి ఏపీ మూలాలున్న ఉషా చిలుకూరి..
మిల్‌వాకీ: రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జె.డి.వేన్స్ (39)ని ఎంపిక చేసుకున్నట్లు సోమవారం అర్ధరాత్రి దాటాక (భారత కాలమానం ప్రకారం) ప్రకటించారు. ఈ విషయాన్ని తన ‘ట్రూత్’ సోషల్ నెట్‌వర్క్ ద్వారా తెలిపారు.
జేడీ వేన్స్ సతీమణి ఉషా చిలుకూరి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని శాన్‌డియాగోలో స్థిరపడ్డారు. 2014లో వేన్స్, ఉషల వివాహం జరిగింది. యేల్ లా స్కూల్లో వీరిద్దరు కలిసి చదువుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. తన ఎదుగుదలలో ఉషా పాత్ర ఎనలేనిదని వేన్స్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment