సాక్షి, అమరావతి: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఆంధ్రప్రదేశ్ గణనీయ పురోగతి కనబరుస్తోంది. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రులకు విస్తృతంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ప్రధానంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాయడంతో రాష్ట్రంలో సానుకూల పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం మరో మూడు ఐఎస్‌ఓ ట్యాంకులు ఇవ్వనుంది. రేపు మధ్యాహ్నం దుర్గాపూర్‌లో ఐఎస్‌ఓ ట్యాంకులు అందజేయనుంది. ఎల్లుండి 60 టన్నుల ఆక్సిజన్‌తో ప్రత్యేక రైలు కృష్ణపట్నం చేరుకోనుంది. ఇప్పటికే దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీలో 2 ట్యాంకుల్లో అధికారులు ఆక్సిజన్ నింపారు
ప్రత్యేక రైలు ద్వారా మూడు ట్యాంకుల చొప్పున నిరంతర ఆక్సిజన్ సరఫరా చేయనున్నారు. ప్రత్యేక రైలులో ఒక్కో ట్రిప్పులో 60 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుంది. ఒడిశాలో వివిధ ఫ్యాక్టరీల నుంచి ప్రత్యేక రైలు ఆక్సిజన్ సేకరించనుంది. దీంతో నెల్లూరు, రాయలసీమ జిల్లాలో ఆక్సిజన్ రిజర్వ్‌లో ఉంచగలమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి గుజరాత్ నుంచి మరో 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ రానుంది. రేపు ప్రత్యేక రైలు ద్వారా గుంటూరుకు ఈ ఆక్సిజన్ చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment