AP CM Jagan Review Meeting On Grain Collection Agricultural Activities - Sakshi
Sakshi News home page

పొగాకు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్‌

Published Tue, Oct 11 2022 3:18 PM | Last Updated on Tue, Oct 11 2022 9:15 PM

AP CM Review Meeting On Grain Collection Agricultural Activities - Sakshi

సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలసాగు జరుగుతున్నట్లు, ఇంకా అక్కడక్కడా నాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. సాధారణ సాగు 1.15 కోట్ల ఎకరాలకు ఈ సీజన్‌లో చేరుకుంటుందని పేర్కొన్నారు.

గడచిన మూడేళ్లలో 3.5 లక్షల ఎకరాల్లో ఉద్యానవన సాగు పెరిగిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సాధారణ పంటల నుంచి ఉద్యానవన పంటలవైపు రైతులు మళ్లుతున్నారన్నారు. రబీకోసం కూడా అన్నిరకాలుగా సన్నద్ధమయ్యామని తెలిపారు. 57.31 లక్షల ఎకరాల్లో రబీ సాగు విస్తీర్ణంగా అంచనా వేస్తున్నట్లు, 96 లక్షల మెట్రిక్‌ టన్నుల విత్తనాలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఇ–క్రాపింగ్‌ తీరును ముఖ్యమంత్రికి వివరించారు. సాగుచేసిన పంటల్లో వీఏఏ, వీఆర్‌ఓలు  99 శాతానికిపైగా ఆధీకృతం పూర్తిచేశారని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఈ నెల 15వ తేదీలోగా రైతుల అథంటికేషన్‌ కూడా పూర్తిచేసి, వారికి డిజిటల్‌, ఫిజికల్‌ రశీదులు కూడా ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేవించారు. అనంతరం పకడ్బందీగా సోషల్‌ఆడిట్‌ కూడా పూర్తిచేయాలని తెలిపారు. నిర్దేశించుకున్న టైంలైన్‌ ప్రకారం ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. 14.10 లక్షల హెక్టార్లలో వరి పండించారని అధికారులు అంచనా వేశారు. నవంబరు  మొదటివారం నుంచి కొనుగోళ్లు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాయిశ్చరైజర్‌ మీటర్, అనాలసిస్‌ కిట్, హస్క్‌ రిమూవర్, పోకర్స్, ఎనామెల్‌ ప్లేట్స్, జల్లించే పరికరాలతో సహా వీటన్నింటినీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
► ఇ–క్రాపింగ్‌ చేయడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో పూర్తిస్థాయిలో పారదర్శకత వచ్చింది. 
► ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ రైతు కూడా ఎక్కడా ఫిర్యాదు చేయకూడదు. 
► గన్నీబ్యాగులు, కూలీలు, రవాణా.. అవసరమైన మేరకు ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి. 
► ధాన్యం కొనుగోళ్లలో సహాయంకోసం తీసుకుంటున్న వారిని రైతు సహాయకులుగా వ్యవహరించాలి.
► ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలి.
► రైతు భరోసా కేంద్రాల్లో ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలి.
► ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల్లో పోస్టర్లుకూడా పెట్టాలి. 
► రాష్ట్రంలో విస్తారంగా వరి సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపైనా దృష్టిపెట్టాలి.
► దేశీయంగా డిమాండ్‌ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతిచేసే అవకాశాలపైనా దృష్టిపెట్టాలి.
► ఈ విషయంలో ఎగుమతులు రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో కలిసి పనిచేయాలి. 
► ఇది రైతులకు ఉభయతారకంగా ఉంటుంది.
చదవండి: ‘మీడియా రంగంలోకి నేను వస్తున్నా.. రామోజీ చూసుకుందాం’

► బ్రోకెన్‌ రైస్‌ను ఇథనాల్‌ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి.
► ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్‌ తయారీ కాబోతుంది.
► రంగు మారిన ధాన్యం, బ్రోకెన్‌ రైస్‌ నుంచి ఇథనాల్‌ తయారీపై దృష్టి పెట్టాలి.
► ఎక్కడైనా పంటలకు ఎంఎస్‌పీ కన్నా తక్కువ వస్తుందని అంటే.. కచ్చితంగా జోక్యంచేసుకుని ఎంఎస్‌పీ ధరలకు కొనుగోలు చేయాలి.
► ఎక్కడైనా ధర రాని పక్షంలో, సీఎంయాప్‌ ద్వారా ఫిర్యాదు రాగానే  రైతును ఎలా ఆదుకుంటామనే విషయంలో ఎస్‌ఎల్‌ఏ పకడ్బందీగా ఉండాలి. 
► కొనుగోలు చేసిన సరుకును నిల్వచేసే ప్రాంతంలో జియోఫెన్సింగ్, అలాగే ఉత్పత్తులకు క్యూ ఆర్‌ కోడ్‌ కూడా ఉంటుందని అధికారులు తెలపగా.. ఇదే తరహా విధానాన్ని పౌరసరఫరాలశాఖలో కూడా పాటించాలని సీఎం అన్నారు. 

పొగాకు రైతులను ఆదుకోవాలి
►పొగాకు రైతులకు నష్టం రాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి. 
►రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి.
►దీనివల్ల ధరలు పతనం కాకుండా రైతులకు మేలు జరుగుతుంది. 

►అక్టోబరు 17న ఈ ఏడాది రైతు భరోసా రెండో విడతకు  అన్నిరకాలుగా సిద్ధం అవుతున్నామని అధికారులు తెలిపారు.
►వైఎస్సార్‌ యంత్రసేవకు సంబంధించిన పోస్టర్లను ఆర్బీకేల్లో ఉంచాం
►ఆర్బీకేల్లో అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవలకు అయ్యే ఖర్చు తదితర వివరాలతో పోస్టర్లను ఆర్బీకేల్లో ఉంచాం. 
►ఆర్బీకేల్లో సేవలందిస్తున్న వారిని ఆర్బీకే మిత్రలుగా వ్యవహరించాలని నిర్ణయం.

సాయిల్‌ డాక్టర్‌ విధానంపై చర్చ.
►ఖరీఫ్‌ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు పూర్తికావాలి.
►ప్రతి ఏటా కూడా ఇలాగే పరీక్షలు చేయాలి.
►దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత కార్డులో రికార్డు చేయాలి
►భూసార పరీక్ష ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వేయాలన్న దానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. 
►పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి.
►ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం దేశంలో ప్రసిద్ధ చెందిన బాంబే ఐఐటీ, కాన్పూర్‌ ఐఐటీలో కొన్ని సాంకేతిక విధానాలను పరిశీలించామని అధికారులు తెలిపారు.

►ప్రతి ఆర్బీకేలో సాయిల్‌ టెస్టింగ్‌ డివైజ్‌ పెట్టాలి.
►దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుంది.
►తద్వారా రైతులకు పెట్టబడులుతగ్గి, ఖర్చులు తగ్గుతాయి.
►అంతేకాక మంచి వ్యవసాయ ఉత్పత్తులను సాధించడానికి అన్నిరకాలుగా ఈ విధానం ఉపయోగపడుతుంది.  

ఈ సమీక్షా సమావేశంలో పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి(మార్కెటింగ్, సహకారం) చిరంజీవిచౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ హరికిరణ్, సివిల్‌ సఫ్లైస్‌ వీసీ అండ్‌ ఎండీ జీ వీరపాండ్యన్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ వీసీ అండ్‌ ఎండీ జి శేఖర్‌బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement