
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 13న సీఎం జగన్ చేతుల మీదుగా నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. విజయవాడ లబ్బీపేటలోని ఏ–1 కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన సంస్థలు, వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవార్డులు ప్రకటించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 11 మంది, లలిత కళలు, సాంస్కృతిక రంగాల్లో 20 మంది, సాహిత్య విభాగంలో ఏడుగురు, జర్నలిజంలో ఏడుగురు, కోవిడ్ ఫ్రంట్‌లైన్ యోధులు ఏడుగురు, ఉత్తమ సేవలందించిన మరో 8 సంస్థలకు అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment