awards cermony
-
సందడిగా సినీ అవార్డుల వేడుక
సాక్షి, చెన్నై: సినీ, బుల్లితెర నటులకు ప్రోత్సాహక అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలోని శిఖరం హాల్లో సందడి సందడిగా జరిగింది. డాక్టర్ అనురాధ జయరామన్ మహా ఫైన్ ఆర్ట్స్, కలైమామణి నెల్లై సుందరరాజన్ యునైటెడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. విశ్రాంతి న్యాయమూర్తి ఎ.రామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని నటీనటులకు ప్రోత్సాహక అవార్డులను అందజేశారు. ఈ వేదికపై నటుడు ఆరియన్, బుల్లితెర నటుడు జిస్ను మీనన్, నటి రమ్యకృష్ణన్, లతాభాను, సీనియర్ పాత్రికేయుడు ఎం.టి.రామలింగం తదితరులు అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో గ్లోబ ల్ మధుకృష్ణ, కోడంబాక్కం శ్రీ తదితరులు పాల్గొన్నారు. -
13న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 13న సీఎం జగన్ చేతుల మీదుగా నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. విజయవాడ లబ్బీపేటలోని ఏ–1 కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన సంస్థలు, వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవార్డులు ప్రకటించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 11 మంది, లలిత కళలు, సాంస్కృతిక రంగాల్లో 20 మంది, సాహిత్య విభాగంలో ఏడుగురు, జర్నలిజంలో ఏడుగురు, కోవిడ్ ఫ్రంట్‌లైన్ యోధులు ఏడుగురు, ఉత్తమ సేవలందించిన మరో 8 సంస్థలకు అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అయ్యో సార్లూ.. ఇదేం తీరు..
సిరిసిల్లటౌన్: గణతంత్ర వేడుకల్లో ఉద్యోగులకు ఇచ్చే సేవా పురస్కార అవార్డుల్లో అధికారుల తీరుపై పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఓ మహిళాధికారి ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. జిల్లా బీసీడీవో కార్యాలయంలో ఏబీసీడబ్ల్యూగా సంపూర్ణ ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని అధికారులు గురువారం రాత్రి ఫోన్‌చేసి అవార్డుకు ఎంపికైనట్లు చెప్పి ఆహ్వానించారు. దీంతో ఆమె శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు వచ్చారు. తీరా అవార్డు ఇచ్చే సమయంలో బీసీ వెల్ఫేర్ శాఖకు అతీతంగా ఎస్సీ వెల్ఫేర్ శాఖకు చెందిన మరో వ్యక్తికి ఇచ్చారు. దీంతో ఏబీసీ డబ్ల్యూ సంపూర్ణ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎస్సీ వెల్ఫేర్ శాఖను తమ శాఖలో పూర్తిగా విలీనం చేయకుండానే తమ శాఖకు చెంది న వారికి కాకుండా ఇతరలకు ఎలా ఇస్తారంటూ..రోదించారు. అవార్డు వచ్చిం దని పిలిచి..అవమానిస్తారా అంటూ.. బీసీడివో అఫ్జల్‌మోహీయోద్దీన్‌తో వాగ్వాదానికి దిగారు. విషయాన్ని డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ దృష్టికి తీసుకుపోయానని ఆమె వివరించారు. శాఖలో పనిచేసే అధికారుల వృత్తిలో ప్రతిభను ఉన్నతాధికారులకు నివేదించడమే మావంతని అవార్డులు ఇవ్వడం మా పరిధిలో లేదని వివరించారు. -
అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
-
ఉత్తమ లఘు చిత్రం 'ది ఫోన్ కాల్'
-
అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం
లాస్ఏంజెల్స్: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుక ఆరంభమైంది. ప్రస్తుతం అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఉత్తమ సహాయ నటుడుగా జేకే సిమన్స్ అవార్డు అందుకున్నారు. విప్లాష్ చిత్రంలో నటనకుగాను 60 ఏళ్ల సిమన్స్కు ఈ పురస్కారం దక్కింది. హాలీవుడ్ తారల హంగామాతో 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. *ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 'ఐడా' (పోలాండ్) * ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రం 'ది ఫోన్ కాల్' * ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం 'వెటరన్ ప్రెస్1' * ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - మలోన (ది గ్రాండ్ బుడా పెస్ట్ హోటల్) * ఉత్తమ సహాయ నటి పెట్రిసియా ఆర్వైడ్ (బాయ్‌హుడ్) *ఉత్తమ సౌండ్ ఎటిడింగ్ 'అమెరికన్ స్నైపర్' -
ఆస్కార్ తెర వెనక...ముందు
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకున్నవారికి అదో మధుర స్మృతి. అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నవారికీ అదో తీపి గుర్తు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేవారికీ ఓ మధురానుభూతి. రంగు రంగుల వెలుగు జిలుగుల మధ్య. తారల తళకుబెళకుల మధ్య ఆద్యంతం హృద్యంగా సాగే అవార్డుల కార్యక్రమం వెనుక బోలెడంత తతంగం ఉంటుంది. ఈసారి ఆస్కార్ పండుగ భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది. అవార్డుల కార్యక్రమం రెడ్ కార్పెట్ స్వాగతంతో ప్రారంభమవుతుంది. అవార్డులతో సంబంధం లేకుండా రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా నడుస్తూ కెమేరాలకు పోజులివ్వడానికీ ఒక్క హాలీవుడ్ నుంచే కాకుండా పలు ప్రపంచ దేశాల హీరోయిన్లు పోటీ పడతారు. కేట్ విన్స్లెట్, నికోల్ కిడ్మన్ లాంటి అందాల తారలతో రెడ్ కార్పెట్‌పై నడవడానికి మన బాలీవుడ్ ఐశ్వర్య రాయ్ నాలుగైదు సార్లు పోటీ పడడం తెలిసిందే. ఆఖరికి తల్లయిన సమయంలో కూడా ఆమె రెడ్ కార్పెట్‌పై అందాలు చిందించడం అంటే ఆ రెడ్ కార్పెట్‌పై నడకలకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. సినీ తారలకే కాకుండా డ్రెస్ డిజైనర్లకు కూడా ఇది పెద్ద పండుగే. ర్యాంప్‌లపై హొయలొలికించే మోడళ్లకు డ్రెస్ డిజైన్ చేయడం కంటే ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై నడిచే తారల డ్రెస్ డిజైన్‌కు వారు పోటీ పడతారు. ఇక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించే ఆతిథేయి (హోస్ట్) పాత్ర కూడా ఆషామాషీ కాదు. వేదిక పైకి రాకముందు హోస్ట్ కొన్ని వందల సార్లు రిహార్సల్ చేస్తారు. కార్యక్రమాన్ని పండించేందుకు సినిమాలు మొదలుకొని రాజకీయ, సామాజిక, తదితర అంశాలపై సెటైర్లు వేస్తారు. ఈ విషయంలో హోస్ట్‌కు తర్ఫీదు ఇచ్చేందుకు ప్రత్యేకమైన బృందం ఉంటుంది. అవార్డుల ప్రదానం సందర్భంగా హోస్ట్‌కు ప్రాంప్టింగ్ చేయడానికి దాదాపు డజను మంది ఉంటారు. నటుడు, నిర్మాత ఓల్డే బిల్లీ క్రిస్టల్ ఏకంగా తొమ్మిది సార్లు హోస్ట్‌గా పనిచేశారు. సభికులను ఆకట్టుకునేందుకు కమెడియన్లను మారుతున్న ట్రెండ్‌ను అనుసరించి నిర్వాహకులు ఎంపిక చేస్తారు. వేదికపై నుంచి అవార్డులు అందుకునే వారు ఏం మాట్లాడుతారనే అంశంపై వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు సభికులకు కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. అవార్డులు అందుకున్న కొంతమంది అవార్డు రావడానికి కారణమైన సినిమా దర్శకుడు, నిర్మాత, తమతో పాటు పనిచేసిన నటీనటులు, సాంకేతిక సిబ్బందితోపాటు భార్య, పిల్లలు, పని మనుషులు, ఇంట్లో పెంచుకుంటున్న బొచ్చు కుక్కకు కూడా థాంక్స్ చెబుతారనడం అతిశయోక్తి కాదు. ఎవరిని మరిచిపోతే ఏం గొడవొస్తుందనే భయం కావచ్చు. ఎందుకంటే 2008లో తాను నటించిన ‘మిల్క్’ సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న సియాన్ పెన్ వేదికపై నుంచి పేరు పేరునా అందరికీ థాంక్స్ చెప్పి భార్య రాబిన్ రైట్ పేరు మరిచిపోయాడట. ఇంటికెళ్లాక ఆ విషయమై ఆమె పెద్ద గొడవ చేసిందట. కారణమేదైనా ఆ తర్వాత కొంతకాలానికే వారు విడాకులు తీసుకున్నారు. వేదికపై హఠాత్తుగా ఊహించని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అవార్డులు తీసుకునే వారు ఉద్విగ్నానికి లోనై అవార్డులు ఇచ్చేవారిని (ఆడ, మగ) ప్యాసినేట్గా ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత స్టీవెన్ స్పీల్బెర్గ్ తన చిత్రం షిండ్లర్స్ లిస్ట్‌కు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ వచ్చినప్పుడు నిర్వాహకులు చెప్పినవారి నుంచి కాకుండా తన గురువు, ప్రముఖ జపాన్ దర్శకుడు అకిరా కురసోవా నుంచి అవార్డు అందుకున్నారు.