
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల్లో రికార్డు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం రోజు రోజుకూ పరీక్షలను పెంచుకుంటూ వెళ్తోంది. ఎనిమిది రోజుల కిందట రోజుకు 50 వేల వరకూ టెస్టులు చేస్తున్న పరిస్థితుల నుంచి తాజాగా ఆదివారం 1,14,299 టెస్టులు చేశారు. 2020 మార్చి నుంచి ఇప్పటివరకూ ఇవే అత్యధికం. ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా బాధితులను త్వరగా గుర్తించి, వారికి సరైన చికిత్స అందించడానికి వీలవుతుంది.
అందుకే 14 వైరాలజీ ల్యాబొరేటరీల్లో మూడు షిఫ్టుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. మరోవైపు ట్రూనాట్ ద్వారా టెస్టులు కూడా అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైతే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించి బాధితులను హోం ఐసొలేషన్ లేదా కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్టుల ఫలితాలు కూడా మరింత వేగంగా వచ్చేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment