
సాక్షి, అమరావతి: కోరోనా క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ల కుటుంబాల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ విధుల్లో భాగంగా సేవలందిస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు ఎవరైనా కరోనాతో మృతిచెందితే వారి కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా సర్కారు చర్యలు తీసుకుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీచేశారు. వైద్యుడు మరణించిన ఆస్పత్రి ఉన్న జిల్లాకు సంబంధించిన డీఎంహెచ్‌వో లేదా డీసీహెచ్‌ఎస్ లేదా బోధనాసుపత్రి అయితే సూపరింటెండెంట్ వెంటనే వివరాలు పంపించాలని, వివరాలు వచ్చిన వెంటనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
(చదవండి: కోవిడ్ పరీక్షల ధరలు తగ్గింపు)
Comments
Please login to add a commentAdd a comment