
అమరావతి: దేశంలో కరోనా మహమ్మరి వేగంగా విజృంభిస్తుంది. ఈ మహమ్మరి భారీనా పడ్డ పేద, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. దీని వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కోవిడ్ కారణంగా ఒకేసారి తల్లిదండ్రులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, ఇలా ఏపీ రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ఏకే సింఘాల్ తెలిపారు. ఆ మేరకు తదుపరి ఉత్తర్వులను రేపు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద రూ.10 లక్షలు డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా ప్రతి నెలా పిల్లలకు అందజేయనున్నమని సింఘాల్ పేర్కొన్నారు. వారికి 25ఏళ్లు వచ్చేవరకూ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పిల్లలకు వారికి 25ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుంది. దీనికోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేశారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment