
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేలి్చచెప్పింది. సర్పంచ్ సీట్ల ఖరారు సక్రమంగా లేదని, ఓటుహక్కు కల్పించట్లేదని, ఓటరు గుర్తింపు కార్డున్నా ఓటర్ల జాబితాలో పేరు తీసేశారని.. ఇలా రకరకాల అభ్యర్థనలతో దాఖలైన పలు వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులివ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల నిమిత్తం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment