![AP High Court Serious Comments On Amaravati Padayatra - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/2/ap.jpg.webp?itok=cdjpIFOn)
సాక్షి, అమరావతి: అమరావతి పాదయాత్రపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పాదయాత్రలో ముందు రైతులున్నప్పటికీ వెనుక వేరేవాళ్లు ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. పాదయాత్ర ద్వారా కోర్టులపైనా ఒత్తిడి తెస్తారా? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి పాదయాత్ర రాజకీయ యాత్ర. పిటిషన్‌లో పార్టీ కానివారు అప్పీల్ ఎలా దాఖలు చేస్తారంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితిని హైకోర్టు ప్రశ్నించింది.
రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతపై అభ్యంతరం లేవనెత్తిన రాష్ట్ర ప్రభుత్వం.. సవివరంగా కౌంటర్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి తెలిపింది. దీంతో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
చదవండి: ప్రధాని మోదీ, సీఎం జగన్ విశాఖ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment