
సాక్షి, తిరుపతి: కుప్పంలో జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పంలో ఇక గెలవలేమనే నిరాశతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 33 ఏళ్లుగా కుప్పానికి చంద్రబాబు చేసేందేమీ లేదని, ప్రజలపై దాడులు చేయడం నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘వైఎస్సార్‌సీపీ కార్యకర్త సురేష్ ఇంటిపై దాడి చేశారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొనేలా చంద్రబాబు ప్లాన్ చేసి.. బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి దాడులు చేయించారు. మేము దౌర్జన్యం చేస్తున్నామని ఆరోపిస్తున్నారు. దౌర్జన్యాలతో కుప్పంలో గెలవాలన‍్నది చంద్రబాబు ఆలోచన. ప్రజలపై దాడులు చేయడం నీతిమాలిన చర్య. రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయ కుట్రలతో హంద్రీనీవా పనులకు ఆటంకం కల్గిస్తున్నారు. ఎన్నికల్లోపే కుప్పం కెనాల్ పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.
ఇదీ చదవండి: నారా వెన్నులో ఓటమి వణుకు
Comments
Please login to add a commentAdd a comment