
సాక్షి, తాడేపల్లి: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన రెండో విడత కార్యక్రమాన్ని గురువారం ప్రభుత్వం అమలు చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఎకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. రెండో విడతగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు 693 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నారు.
ఇప్పటికే మొదటి దశ కింద ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 671 కోట్లను జమ చేశారు. చంద్రబాబు పెట్టిన బకాయిలు రూ. 1,774 కోట్లతో సహా రేపు వేయబోయే విద్యా దీవెనతో మొత్తం రూ. 5573 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పటివరకూ విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్దలు, అమ్మ ఒడి, విద్యాకానుక, మనబడి, నాడు నేడు కింద మొత్తం 25,714 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మూడో దశ విద్యాదీవెన ఈ డిసెంబర్‌లో, నాలుగో విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం అమలు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment