
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలోనూ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) కీలక భూమిక పోషించబోతోంది. రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ డేటా, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ డేటా, వాతావరణ సమాచార డేటా వంటి డిజిటల్ సాధనాలు రంగప్రవేశం చేయబోతున్నాయి. వ్యవసాయరంగ భవిష్యత్‌ను పునర్నిర్మిం చేందుకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సుపై యూనివర్సిటీ స్థాయిలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు అడుగులు వేస్తున్నాయి.
ఇప్పటికే ఈ దిశగా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టగా.. తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కృత్రిమ మేధస్సును బీఎస్సీ (ఆనర్స్)హార్టికల్చర్లో ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చబోతోంది. అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, డ్రోన్స్ అండ్ రోబోటిక్స్ ఇన్ హార్టికల్చర్ చాప్టర్‌ను ప్రవేశపెట్టారు. ఫార్మ్ పవర్, మెషినర్ అండ్ ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్‌ను ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి తరగతి గది స్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రయోజనాలివీ..
వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా వాతావరణ స్థితిగతులు, నీటి పారుదల అవసరాలు, పంట ఆరోగ్యం, పోషక స్థాయిలపై కచ్చితమైన డేటా సేకరించడం, విశ్లేషించడం, క్రమబదీ్ధకరించడం ద్వారా సమయం, వనరులు ఆదా అవుతాయి. ఏఐ, ప్రొటోటైప్ రోబోటిక్స్, రోబో స్ప్రేయర్లు, అధిక రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లతో కూడిన డ్రోన్స్ వంటి డిజిటల్ సాధనాల వినియోగం ద్వారా కచ్చితమైన పంట పర్యవేక్షణ, నిర్వహణకు బాటలు వేస్తాయి.
మొక్కలలో వ్యాధులు, తెగుళ్లు, పోషకాహార లోపాలను గుర్తించడంతోపాటు సిఫార్సు మేరకు సకాలంలో తగిన నివారణ చర్యలు చేపట్టడం ద్వారా పంట నష్టాలు తగ్గిస్తాయి. విత్తు నుంచి కలుపుతీత, పంటకోత వంటి శ్రమతో కూడిన పనులను మానవ రహితంగా చేయడం ద్వారా ఏళ్ల తరబడి వేధిస్తున్న కూలీల కొరత అధిగమించే అవకాశం ఏర్పడుతుంది. ఏఐ వినియోగం మరింత స్థిరమైన, పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలను విస్తరించేందుకు దోహదం చేస్తాయి.
ప్రొటోటైప్ రోబోట్ స్ప్రేయర్ అభివృద్ధి
ఇప్పటికే రైతులకు ఉపయోగపడే ప్రొటోటైప్ (ప్రాథమిక) రోబోట్ స్ప్రేయర్‌ను వర్సిటీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అభివృద్ధి చేశారు. రిమోట్ సెన్సార్‌తో పనిచేసే ఈ స్ప్రేయర్లు కిలో మీటర్ పరిధిలో కనీసం 10–18 గంటల బ్యాటరీ సామర్థ్యంతో ఉపయోగించేలా తీర్చిదిద్దారు. వీటిని పాలీహౌస్‌లలో సాగవుతున్న క్యాప్సికం పంట సాగులో ప్రయోగాత్మకంగా వినియోగించి సత్ఫలితాలను రాబట్టారు.
మరోవైపు జేఎన్‌టీయూకే, ఎన్‌ఐటీల సహకారంతో కృత్రిమ మేధస్సు ద్వారా వంగ పంటలో కీటకాల వర్గీకరణ, గుర్తింపు, నానో జీవ రసాయనాల ద్వారా కీటకాల నియంత్రణ చర్యలపై పరిశోధనా పత్రాలు భారతీయ కీటక శాస్త్ర విభాగ జర్నల్‌లో ప్రచురణకు నోచుకున్నాయి. కీటకాల వర్గీకరణను కృత్రిమ మేధస్సు ద్వారా గుర్తించే ఈ ప్రయత్నంలో 95–98 శాతం కచ్చితత్వం కనిపించిందని నిర్ధారించారు.
సీఎం వైఎస్ జగన్ ఆలోచన మేరకే..
సీఎం వైఎస్ జగన్ సూచన మేరకు వర్సిటీ స్థాయిలో కృత్రిమ మేథను బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్‌లో ఒక పాఠ్యాంశంగా చేర్చబోతున్నాం. ఎన్‌ఐటీ–టీ, జేఎన్‌యూకే సాంకేతిక సహకారంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆచరణలోకి తీసుకొస్తున్నాం. – డాక్టర్ తోలేటి జానకిరామ్, వీసీ, ఉద్యాన వర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment