సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్స్ ఫీజుపై 20% కోవిడ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న 840 బార్ల లైసెన్సులను వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగిస్తూనే 2020–21 సంవత్సరానికి సంబంధించి కొత్త బార్ లైసెన్సు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
► విదేశీ మద్యం, దేశంలో తయారయ్యే విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్, వైన్ అన్నింటిపైనా 10% అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తారు.
► హెకోర్టులో కొత్త బార్ పాలసీపై స్టే ఉన్నందున పాత బార్ పాలసీనే కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
► మార్చి 22 నుంచి ఇప్పటివరకు బార్లు మూసివేసి ఉన్నాయి. అయితే కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం శనివారం నుంచి వాటిని తెరిచేందుకు అవకాశం లభించింది.
► లాక్‌డౌన్ పీరియడ్‌లో రాష్ట్రంలో మూసి వేసిన బార్లకు సంబంధించి 101 రోజులకు లైసెన్సు ఫీజును ఈ సంవత్సరం ఫీజులో సర్దుబాటు చేస్తారు.
‘బార్ల లైసెన్సు’పై 20% కోవిడ్ ఫీజు
Published Sat, Sep 19 2020 4:51 AM | Last Updated on Sat, Sep 19 2020 4:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment