
కడప: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. శనివారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని బ్రహ్మంగారి మఠం వారసులు వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా మఠం వారసులు మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులంతా ఏకాభిప్రాయానికి వచ్చామని, పీఠాధిపతి ఎంపిక సమస్య పరిష్కరించుకున్నామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా రెండో భార్య మారుతి మహాలక్ష్మి సమక్షంలో నేటి సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు.
తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని, సాంప్రదాయం ప్రకారం త్వరలోనే పీఠాధిపతి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో మఠం పీఠాధిపతి సమస్య పరిష్కారం అయిందన్నారు. ఈ సమస్య పరిష్కారం తాము చేయలేదని, బ్రహ్మంగారి అజ్ఞానుసరమే జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ.. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పీఠాధిపతిని ప్రకటిస్తామని తెలిపారు.
కడప: బ్రహ్మంగారి మఠంలో ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. బ్రహ్మంగారి మఠంలోని వారసత్వం, ఆచారాలు, గ్రామస్తుల అభిప్రాయాలను ఆయన తెలుసుకోనున్నారు. మఠానికి సంబంధించిన సేకరించిన పలు అభిప్రాయాల నివేదికను ఆయన ప్రభుత్వానికి అందజేయనున్నారు.
చదవండి: బ్రహ్మంగారి మఠంపై కుదిరిన సయోధ్య
Comments
Please login to add a commentAdd a comment