raghuramireddy
-
కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం
కడప: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. శనివారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని బ్రహ్మంగారి మఠం వారసులు వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా మఠం వారసులు మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులంతా ఏకాభిప్రాయానికి వచ్చామని, పీఠాధిపతి ఎంపిక సమస్య పరిష్కరించుకున్నామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా రెండో భార్య మారుతి మహాలక్ష్మి సమక్షంలో నేటి సాయంత్రం ప్రకటిస్తామని తెలిపారు. తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని, సాంప్రదాయం ప్రకారం త్వరలోనే పీఠాధిపతి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో మఠం పీఠాధిపతి సమస్య పరిష్కారం అయిందన్నారు. ఈ సమస్య పరిష్కారం తాము చేయలేదని, బ్రహ్మంగారి అజ్ఞానుసరమే జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ.. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పీఠాధిపతిని ప్రకటిస్తామని తెలిపారు. కడప: బ్రహ్మంగారి మఠంలో ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. బ్రహ్మంగారి మఠంలోని వారసత్వం, ఆచారాలు, గ్రామస్తుల అభిప్రాయాలను ఆయన తెలుసుకోనున్నారు. మఠానికి సంబంధించిన సేకరించిన పలు అభిప్రాయాల నివేదికను ఆయన ప్రభుత్వానికి అందజేయనున్నారు. చదవండి: బ్రహ్మంగారి మఠంపై కుదిరిన సయోధ్య -
సీపీఎస్ రద్దు కోసం పోరాటం
కడప ఎడ్యుకేషన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని (సీపీఎస్) రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని ఫ్యాప్టో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ రఘురామిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే పోరుయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కడప డీసీఈబీలో ప్రచారజాతకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జూలై 30 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారజాతను నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ జీవితంలో భధ్రతను దెబ్బతీసే సీసీఎస్‌ను రద్దుచేయాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ సుబ్రయణ్యంరాజు, సెక్రటరీ విజయ్‌కుమార్, నాయకులు లక్ష్మిరాజా, రఘనాధరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, శివారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నిత్యప్రభాకర్, సివిప్రసాద్, సుబ్బరాజు, నరసింహారెడ్డి, గురవయ్య, మహేష్‌బాబు, శ్రీనివాసులరెడ్డి, మణికుమార్, ఖాదర్‌భాష తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా
►మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి సాక్షి, దువ్వూరు : ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లుగా కొన్ని దుష్టశక్తులు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరులో నిన్న (సోమవారం) పార్టీ నాయకుడు సిద్ధయ్యనాయుడు స్వగృహంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సీపీ తరఫున తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో చేరడమనేది తన స్వభావానికి పూర్తి విరుద్ధమని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, బొంతపల్లె వెంకటసుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు. -
నిధుల స్వాహా పర్వం పయనమెటో?
కడప అర్బన్ : కడప ఆర్ట్స్ కళాశాలలో నిధుల స్వాహా పర్వం వెనుక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఇతర ఫీజుల నిధులు దాదాపు రూ. 60 లక్షలకు పైగా నగరంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ నిధులపై కళాశాలలోని సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి కన్నేశారు. తన చేతికి మట్టి అంటకుండా మారుతీనగర్‌లో మ్యారేజ్‌బ్యూరో నిర్వహిస్తున్న కవిత అనే మహిళను సహాయపడాలని కోరారు. ఆమెకు ప్రముఖ వ్యక్తులతో పరిచయం ఉండడంతో వారిలో కొందరిని నిధుల స్వాహాకు పాత్రధారులుగా ఉపయోగించుకుంది. రఘురామిరెడ్డి ద్వారా అతని స్నేహితుడు ఎంఎం మహమ్మద్ అలియాస్ చిన్నా ద్వారా రూ. 4,600 చెక్కును ట్రైలర్‌గా ఎస్బీఐ ఖాతా ద్వారా డ్రా చేయించారు. తన పథకం ఫలించడంతో స్వాహా పర్వానికి పూనుకున్నాడు. రఘురామిరెడ్డి విద్యార్థుల స్కాలర్‌షిప్పుల చెక్‌బుక్‌లోని నాలుగు చెక్కులను మార్చుకునేందుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యాడు. మారుతీనగర్‌కు చెందిన షారోన్ కృపాకర్ ద్వారా రూ. 4.30 లక్షలను సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెక్కును పంపించి ఖాతాలో జమ అయ్యేలా చూశారు. ఈ క్రమంలో సదరు బ్యాంకు మేనేజర్ అథారిటీ లెటర్ తీసుకు రావాలని కృపాకర్‌ను కోరారు. తమ గుట్టు రట్టవుతుందని రఘురామిరెడ్డి, కవితతో కలసి ప్రిన్సిపాల్ వెంకటలక్షుమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి అథారిటీ లెటర్‌ను పంపించారు. అథారిటీ లెటర్‌ను బ్యాంకు మేనేజర్ ప్రిన్సిపాల్ వెంకట లక్షుమ్మ వద్దకు పంపారు. ఆమె తన సంతకం ఫోర్జరీ అయిందని గమనించి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రంగనాయకులు కేసు నమోదు చేశారు. -
అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు
కడప కార్పొరేషన్: వంద అబద్దాలు ఆడి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మేయర్ కె. సురేష్‌బాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో అధికారపార్టీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని, వైఎస్ జగన్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని చర్చను పక్కదారి పట్టించిందన్నారు. తద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశంలేకుండా వ్యవహరించిందన్నారు. కొత్త రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి అంశాల ప్రస్తావనే లేకుండా పదిహేను రోజులపాటు విమర్శలతోనే కాలం వెల్లబుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుదాడితో ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాలన్నారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరునెలలకు చేస్తారా.. సంవత్సరానికి చేస్తారా.. బడ్జెట్లో కేటాయించిన రూ. 5వేల కోట్లు ఇందుకు సరిపోతాయా... అని ఆయన ప్రశ్నించారు. రుణాలు కట్టాలని లేనిపక్షంలో బంగారు వేలం వేస్తామని ఇప్పటికే రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయన్నారు. వేలం వేస్తే ఆ అవమానాన్ని భరించలేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పకుండా ఎంతసేపు వైఎస్ హయాంలో నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. అసెంబ్లీలో రాజధాని రాజధాని విషయమై అధికార పక్షం అనుసరించిన విధానం చాలా నిరంకుశంగా ఉందని మండిపడ్డారు. మద్రాస్ నుంచి విడిపోయినప్పుడు ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో రాజధానిపై అసెంబ్లీలో ఐదురోజులపాటు చ ర్చ జరిగిందని, ఓటింగ్ కూడా నిర్వహించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చర్చకు అనుమతించ కుండా, ప్రకటన చేసి చర్చించాలనడం అప్రజాస్వామికమన్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రాన్ని పాలించి, ఈలోకంలో లేకుండా పోయిన వ్యక్తిని పదేపదే విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులు ఆ తర్వాత పాలించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను పల్లెత్తు మాట కూడా అన రని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించకుండా గొంతునొక్కడం దుర్మార్గమన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీనాయకులు యానాదయ్య, కరీముల్లా పాల్గొన్నారు. -
నేనున్నా.. మీకేం కాదు
సాక్షి, కడప : తన రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలతో పాటు ప్రజలలో భరోసా నింపారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, జయరాములు, జెడ్పీ చైర్మన్ రవి, వైఎస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ తిరుపేల రెడ్డి, మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి, మాసీమ బాబుతో పాటు నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. డిపాజిటర్లకు అన్యాయం చేసిన అక్షయ గోల్డ్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానన్నారు. జర్నలిస్ట్‌లకు హెల్త్ కార్డులు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో కూడా మాట్లాడతామన్నారు. కడప, పులివెందులకు చెందిన ముస్లింలు ఈ సందర్భంగా జగన్‌తో ప్రత్యేకంగా భేఠీ అయ్యారు. వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. -
రాజీ పడక.. ఒత్తిళ్లకు బెదరక
కర్నూలు: రాజకీయ ఒత్తిళ్లకు బెదరకుండా.. అధికార పార్టీ నాయకులతో రాజీపడకుండా ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లాలో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పేరు సంపాదించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన శాఖా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పోలీస్ శాఖ పనితీరును గాడిలో పెట్టారు. జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బందులు పడే ప్రజానీకం కోసం మీతో మీఎస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుద్యోగులు ఫ్యాక్షన్ ఉచ్చులోకి కూరుకుపోకుండా ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ చూపారు. ఆదోని, కోసిగి, కర్నూలు టౌన్‌కు చెందిన యువకులకు 600 మందికి శిక్షణనిచ్చి కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగాలు ఇప్పించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు ఆదోనిలో పేరు మోసిన మట్కా కింగ్. ఈయన ఆస్తుల విషయంలో విచారణ జరిపించాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఆమ్వే కంపెనీకి చెందిన సీఈఓ విలియం స్కాట్ పింకినేను ఢిల్లీలోని గూర్గావ్లో అరెస్టు చేశారు. జిల్లాలో సంచలనం రేపిన నర్సింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారం మొదలుకొని కర్నూలు-నంద్యాల జంట హత్యలను ఛేదించారు. మాల్‌ప్రాక్టీస్ ముఠా గురివిరెడ్డి ముఠాను అరెస్టు చేయించడంలో శాస్త్రీయ పద్ధతులను పాటించి ఫలితాలు సాధించారు. వసంత గోల్డ్, అక్షయ గోల్డ్, అవని గోల్డ్ సంస్థలకు సంబంధించి డిపాజిటర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెట్టుబడుల చట్టాన్ని ఉపయోగించి వాటి నిర్వాహకులను కటకటాలకు పంపారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఏడాది క్రితం ఎస్పీగా జిల్లాకు వచ్చిన ఆయన నేతల ఒత్తిళ్ల మధ్యనే విధులు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన మూడున్నర నెలలకే హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ఆయనను బదిలీ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి మళ్లీ ఇక్కడే కొనసాగేలా ఉత్తర్వులు పొంది సంచలనం సృష్టించారు. అయితే ప్రస్తుతం ఈయన బదిలీ వెనుక జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వద్ద పంచాయితీ పెట్టి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. -
గుణపాఠం తప్పదు
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మున్సిపల్, జిల్లా పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు ఒకే రకమైన గుణపాఠం చెబుతారని వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి తెలిపారు. ఆదివారం కడపలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర పాలక మండలి సభ్యులు డీసీ గోవిందరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్‌బాష, బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి జయరాములుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించడం చేతగాక మూడు సంవత్సరాలుగా వాయిదా వేసుకుంటూ వచ్చిందన్నారు. మైనార్టీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడింది టీడీపీనే అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయాయన్నారు. రాష్ట్రపతి పాలన ఉన్నందునే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికలతోపాటే మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయన్నారు. 2008లో టీడీపీ తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ పుట్టనే లేదన్నారు.కొందరు మాజీ మంత్రులు ఇన్నాళ్లు అధికారాన్ని అనుభవించి విభజనకు అన్ని రకాలుగా సహకరించడం ద్వారా రాష్ట్రానికి చేయాల్సిన నష్టమంతా చేశారన్నారు. వారు చేరినంత మాత్రాన టీడీపీది బలం కాదని, వాపేనని తెలిపారు. అభ్యర్థులను ప్రకటించలేని దీనస్థితిలో టీడీపీ, కాంగ్రెస్ : జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేని దీన స్థితిలో కాంగ్రెస్, టీడీపీ ఉన్నాయని రఘురామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. తమ పార్టీ నుంచి ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారని, అందరినీ సంతృప్తిపరచడం కష్టమవుతున్నందున ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి న్యాయం చేస్తామని చెబుతుండటంతో అందరూ త్యాగాలకు సిద్ధపడుతున్నారన్నారు. రాష్ట్రం మళ్లీ కలిసే అవకాశముంది : రాష్ట్ర విభజన ఇంకా పూర్తి కాలేదని జూన్‌లో అపాయింటెడ్ డేట్ ప్రకటించినందున కొత్త ప్రభుత్వాన్ని బట్టి పరిస్థితి మారవచ్చని, రాష్ట్రం కలిసి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని వైఎస్ఆర్సీపీ నేతలు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినందున రాజ్యాంగ బెంచ్‌లో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు. -
కిరణ్ స్నేహితుడికి ఎమ్మెల్సీ పోస్ట్‌కు గవర్నర్ చెక్
హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హడావిడిగా ఇచ్చిన జీవోలపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు. కిరణ్ సన్నిహితుడికి ఎమ్మెల్సీ పోస్ట్ కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలకు గవర్నర్ నరసింహన్ చెక్ పెట్టారు. గవర్నర్ కోటాలో రఘురామిరెడ్డిని ఎమ్మెల్సీ చేసేందుకు కిరణ్ ప్రయత్నించారు. రెండోసారి కూడా రఘురామిరెడ్డి పేరునే కిరణ్ సూచించారు. అయితే రఘురామిరెడ్డి ఫైల్‌ను గవర్నర్ తిరస్కరించారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయాన్ని కూడా గవర్నర్ రద్దు చేశారు. కిరణ్‌కు ఓఎస్డీగా ఉన్న సురేందర్‌కు అర్హత లేకున్నా సహకార శాఖ సహాయ రిజిస్టార్‌గా బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నరసింహన్ రద్దు చేశారు. అంతేకాకుండా సురేందర్‌ను మాతృసంస్థ ఏపీఐఐసీ ఈడీగా పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.