సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా ఇతర అవసరాలకు వినియోగించింది. దీంతో అప్పులు పెరిగిపోయాయి తప్ప ఆస్తుల కల్పన తగ్గిపోయింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఎత్తిచూపింది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఆస్తుల కల్పనకు ఎంత వ్యయం చేసిందనే వివరాలను కాగ్ నివేదిక వెల్లడించింది. చదవండి: (చంద్రబాబు, రేవంత్ నుంచి ప్రాణహాని)
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అప్పులు చేయడం వాటిని ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర రంగాలకు మళ్లించిన విషయాన్ని సాక్షి గతంలోనే పాఠకులకు తెలియజేసింది. ఇప్పుడు కాగ్ కూడా తన నివేదికలో ఈ విషయాన్ని నిర్ధారించింది. 2014–15లో అయితే చేసిన అప్పుల్లో సగం కూడా ఆస్తుల కల్పనకు వ్యయం చేయలేదని స్పష్టం చేసింది. కాగ్ వెల్లడించిన మేరకు చంద్రబాబు ప్రభుత్వం అప్పులు, ఆస్తుల కల్పన వ్యయం ఇలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment