సాక్షి, న్యూఢిల్లీ: 2020–21 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్‌సీపీకి రూ.96,25,25,000 ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మేరకు పార్టీ అందించిన వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. చందాల ద్వారా రూ.25 వేలు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.96.25 కోట్లు వచ్చినట్టుగా ఆ పార్టీ వివరాలు అందించినట్టు ఈసీ పేర్కొంది. పార్టీల ఆదాయ వివరాలు అందించేందుకు అక్టోబర్ 30 వరకూ గడువుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ వైఎస్సార్‌సీపీ మాత్రమే ఆదాయ వివరాలను అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment