
సాక్షి, గుంటూరు: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లికి వెళ్లిన చాగంటి, సీఎం జగన్‌తో భేటీ అయ్యి.. అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు.
టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం ఇటీవలె నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్ల భేటీ మర్యాదపూర్వకంగా జరిగింది. ఈ సందర్భంగా చాగంటిని సత్కరించి.. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమ అందజేశారు సీఎం జగన్. చాగంటితోపాటు శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్, డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు.
గోశాల అద్భుతం
సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం.. సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు చాగంటి, వరప్రసాద్ రెడ్డి. అనంతరం గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి ప్రశంసలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment