Happy Birthday YS Jagan 🎉: Chandrababu Naidu, Mahesh Babu, Chiranjeevi Wishes to AP CM YS Jagan Mohan Reddy - Sakshi
Sakshi News home page

డైనమిక్‌ యంగ్‌ లీడర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: చిరు

Published Mon, Dec 21 2020 12:13 PM | Last Updated on Mon, Dec 21 2020 2:38 PM

Chandrababu Naidu Wishes CM YS Jagan On His Birthday - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(డిసెంబర్‌ 21) 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించిన ఆయన.. ‘వైఎస్‌ జగన్‌ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’. అని ట్వీట్‌ చేశారు. చదవండి: జగనన్న బర్త్‌డే సాంగ్‌ వైరల్‌.. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజును పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, నిరంతరం ప్రజా సేవలో జీవించాలని ఆశిస్తున్నాను’. అని ట్వీటర్‌ వేదికగా పేర్కొన్నారు. అదే విధంగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘గౌరవనీయులు సీఎం వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ విజన్‌, కృషి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి.’ అని ట్వీట్‌ చేశారు. చదవండి: సీఎం జగన్‌కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా తన విషెస్‌ను తెలియజేశారు. ‘డైనమిక్ యంగ్‌ లీడర్‌ వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. లక్ష్యాలను చేధించడంలో మీ సంకల్పం, మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం. ఎంతో సంతోషంగా, అద్భుతంగా ఇంకో ఏడాది గడపాలి. మరెన్నో సంవత్సరాలు ప్రజలకు మీరు సేవలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అని పేర్కొన్నారు. వీరితోపాటు హీరో రవితేజ, మంచు విష్ణు, సుధీర్‌ వర్మ, నిర్మాత బండ్ల గణేష్‌, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, దర్శకుడు గోపిచంద్‌ మలినేని కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement